West Bengalలోని ఒక ఇంగ్లీష్ మీడియం Central Board of Secondary Education (CBSE) పాఠశాలలో నిర్వహించిన ముజ్రా కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. పాఠశాల కార్యక్రమంలో అమ్మాయిలతో అసభ్యంగా ముజ్రా నృత్యం నిర్వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా పాల్గొనడం, ప్రేక్షకులుగా విద్యార్థులు ఉండడం స్థానికుల్లో ఆగ్రహం రేకెత్తించింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
