జూడాల స్టైఫండ్‌పై వివాదం
AP: ఆంధ్రప్రదేశ్‌లో Junior Doctors చేపడుతున్న సమ్మెపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అత్యవసర సేవలను కూడా నిలిపివేయడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తమకు తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హౌస్ సర్జన్లకు రూ. 25,906, పీజీలకు రూ. 64,767 వరకు స్టైఫండ్ అందుతోంది.
సూపర్ స్పెషాలిటీ జూనియర్ డాక్టర్లకు రూ. 80,500 నుంచి 85,100 వరకు ఇస్తున్నారు. ఇకపై ఏటా 3 శాతం పెంపునకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రతి రెండేళ్లకోసారి 15 నుంచి 20 శాతం పెంపు ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.
సీనియర్ డాక్టర్ల వేతనాల కంటే ఎక్కువయ్యే అవకాశం?
ప్రతి రెండేళ్లకోసారి 15 శాతం చొప్పున స్టైఫండ్ పెంచుతూ వెళ్తే భవిష్యత్తులో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ సీనియర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనాల కంటే ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఈ అంశంపై విమర్శలు వస్తున్నాయి.
ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ప్రభుత్వం పరిశీలించింది. హెల్త్ సెక్టార్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తమిళనాడు విధానాన్ని కూడా పరిశీలించింది.
అక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తక్కువ స్టైఫండ్ ఇస్తున్నట్లు, ఏటా కేవలం 3 శాతం మాత్రమే పెంచుతున్నట్లు స్పష్టమైందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుత స్టైఫండ్‌ను కొనసాగించిన ప్రభుత్వం
ఈ నేపథ్యంలో తమిళనాడు స్థాయికి స్టైఫండ్‌ను తగ్గించకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న మొత్తాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ప్రస్తుతం 30 శాతం పెంపు కావాలని, లేదా కనీసం 20 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్‌తో పది రోజులుగా అత్యవసర సేవలతో సహా విధులు బహిష్కరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మెరుగైన స్టైఫండ్ అందుతున్నప్పటికీ రోగులకు ఇబ్బందులు కలిగేలా అత్యవసర సేవలను నిలిపివేయడం ప్రజా వ్యతిరేక చర్యగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిధులతో వైద్య విద్య
జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ నిధులతో మెడికల్ కాలేజీల్లో చదువుకున్నవారేనని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదివినవారు సమ్మెకు దిగడం, అందులోనూ అత్యవసర సేవలను నిలిపివేయడంపై సాధారణ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.



