నటుడు భరత్ కాంత్ కన్నుమూత

May 11, 2026 8:11 AM

హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ (31), యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ (31) దుర్మరణం పాలయ్యారు. నెల్లూరుకు చెందిన భరత్ కాంత్, త్రిలోక్ ప్రాణ స్నేహితులు. శనివారం రాత్రి తమ సొంత ఊరి నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌పైకి ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా వీరి కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో భరత్, త్రిలోక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భరత్ పలు సినిమాల్లో నటించగా, త్రిలోక్ పలు చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media