పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత నిత్యానందరెడ్డికి న్యాయస్థానం మంగళవారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పెద్ద దస్తగిరి హత్య కేసులో అరెస్టయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డిని పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
ఏప్రిల్ 6న జరిగిన పెద్ద దస్తగిరి దారుణ హత్య వెనుక భూవివాదాలే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వివాదాల్లో నిత్యానందరెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన్ని ఈ కేసులో ఏ-13 నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
