22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాంకేతిక కారణాలు, రికార్డుల లభ్యత లేకపోవడంతో గతంలో 22A జాబితాలో చేరిన జరాయితి భూములపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించారు.

సర్వేలో ఆ భూములు ప్రభుత్వానికి చెందినవి కాకుండా రైతుల సొంత జరాయితి భూములేనని నిర్ధారణ కావడంతో వాటిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.దీంతో 12 మంది లబ్ధిదారులకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ సంబంధిత పత్రాలను కలెక్టర్ స్వయంగా అందజేశారు.
