ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాలులో శనివారం ఎన్డీయే పక్షాల శాసనసభ (MLA), శాసన మండలి (MLC) సభ్యుల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై అగ్రనేతలు చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేటప్పుడు ప్రభుత్వం తరఫున గట్టిగా వినిపించాలని, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సభ్యులకు సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వేగంగా పనిచేయాలని నేతలు దిశానిర్దేశం చేశారు.
రాబోయే బడ్జెట్ కేటాయింపులు, పథకాల అమలుపై కూడా ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది.
