AP:మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

February 12, 2026 12:06 PM

ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు ఎక్సైజ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గతంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో నమోదైన కేసులో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అంబటిని విచారించేందుకు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ర్యాలీలో పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసులో అంబటిపై పీటీ వారెంట్‌ జారీ అయ్యింది.

ఇప్పటికే టీటీడీ లడ్డూ వివాదం కేసులో ఆయనకు బెయిల్ రాగా, తాజా కేసులో కూడా ఊరట లభించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి నేడు విడుదల కానున్నారు. దేవుడి దయ వల్ల, న్యాయస్థానాల పై నమ్మకంతో తమ తండ్రికి న్యాయం జరిగిందని కుమార్తె అంబటి మౌనిక పేర్కొన్నారు. టీడీపీ నేతలు కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. బెయిల్ వార్త తెలియగానే గుంటూరులోని అంబటి నివాసం వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media