ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (CJ) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో జన్మించిన ఆయన, హైదరాబాద్‌లో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేశారు. సీనియర్ న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004-2006 మధ్య ఏజీపీగా (AGP), 2018లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ డి. శ్రీనివాస్, అదనపు సాలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి మరియు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.ప్రమాణ స్వీకారం అనంతరం న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు జస్టిస్ బాలాజి మెడమల్లికి అభినందనలు తెలిపారు.
