అడ్మిన్లు జాగ్రత్త! సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే జైలుకే

February 13, 2026 5:23 PM

సోషల్ మీడియా వేదికలపై తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాల పట్ల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అమలాపురం డీఎస్పీ టీ.ఎస్.ఆర్.కే. ప్రసాద్ సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని గ్రూప్ అడ్మిన్లకు దిశానిర్దేశం చేశారు.

వాట్సాప్ గ్రూపుల్లో మత విద్వేషాలు, రెచ్చగొట్టే పోస్టులు వస్తే గ్రూప్ అడ్మిన్‌లే ప్రాథమికంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అభ్యంతరకర సందేశాలను గుర్తించిన వెంటనే తొలగించాలి. వాస్తవాలు నిర్ధారించుకోకుండా నకిలీ వార్తలను షేర్ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని, అలాంటి వారిపై ఐటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా లేదా వ్యక్తిగత దూషణలకు పాల్పడే పోస్టులు పెడితే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. సమాజంలో అశాంతి కలిగించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీసు అధికారులతో పాటు వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు మరియు గ్రూప్ అడ్మిన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత న్యాయస్థానాల (ముఖ్యంగా బాంబే, కేరళ హైకోర్టులు) తీర్పుల ప్రకారం.. గ్రూప్ సభ్యుడు చేసిన పోస్ట్‌కు అడ్మిన్‌కు ‘ముందస్తు ప్రణాళిక’ లేకపోతే నేరుగా శిక్షించలేరు. అయితే, నేరాన్ని ప్రోత్సహించడం లేదా అభ్యంతరకర పోస్టులను తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చట్టపరమైన ఇబ్బందులు తప్పవు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media