మెగా అభిమానులకు సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఫోటో కనువిందు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు క్లిన్ కారా కొణిదెలతో గడుపుతున్న మధుర క్షణాలను పంచుకున్నారు.

ఈ ఫోటోలో రామ్ చరణ్, ఉపాసన కుర్చీల్లో కూర్చుని ఉండగా, వారి ముద్దుల కుమార్తె క్లిన్ కారా తన తండ్రి ఒడిలో హాయిగా కూర్చుని ఉంది.తాతయ్యగా చిరంజీవి తన మనవరాలిని ఎంతో ప్రేమగా చూస్తూ మురిసిపోతున్నారు. ఈ ‘హోల్సమ్’ ఫ్యామిలీ పిక్ చూసిన అభిమానులు “మెగా ఫ్యామిలీ సూపర్” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
