రాష్ట్ర బడ్జెట్ ను ప్రగతిశీల బడ్జెట్ గా అభివర్ణించిన.. ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్

February 15, 2026 8:08 PM

రాష్ట్ర బడ్జెట్ ను ప్రగతిశీల బడ్జెట్ గా అభివర్ణించిన.. ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లను సమ్మిళితం చేస్తూ ప్రజల కు తెలియచేయాలి
బిజెపి అధికార ప్రతినిధి లకు దిశా నిర్దేశం చేసిన బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి లు, మీడియా ప్యానెలిస్టు లతో ఆడియో కాన్ఫరెన్స్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రధానంగా సంపద సృష్టి, అభివృద్ధి , సంక్షేమం అనే మూడు సూత్రాల ఆధారంగా రూపొందించబడింది.
బడ్జెట్ ముఖ్యాంశాలు అనగా

  • భారీ వ్యయం & వృద్ధి: గతంలో ఎన్నడూ లేని విధంగా ₹3,32,000 కోట్ల వ్యయంతో, 11.25% వృద్ధి రేటు లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించడం ఒక సాహసోపేతమైన చర్య. రెవెన్యూ లోటును 1.86 కి పరిమితం చేయడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.
  • డబుల్ ఇంజన్ అభివృద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ కలవడం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారంతో ‘వికసిత ఆంధ్రప్రదేశ్’ ద్వారా ‘వికసిత భారత్’ నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తోందని మాధవ్ ఆడియో కాన్ఫరెన్స్ లో వివరించారు.
  • పారిశ్రామికాభివృద్ధి & పెట్టుబడులు: గూగుల్ (Google) వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో సుమారు $15 బిలియన్ల (₹1,35,000 కోట్లు) పెట్టుబడులకు ఈ బడ్జెట్ ప్రాధాన్యతనిచ్చింది. అలాగే సెమీ కండక్టర్స్ మిషన్ 2.0, రేర్ ఎర్త్ కారిడార్ వంటి ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.
  • రాయలసీమ అభివృద్ధి: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా (Global Horticulture Hub) తీర్చిదిద్దేందుకు ₹30,000 కోట్లతో సమగ్ర ప్రణాళికను రూపొందించారు.
  • ఏపీ వెల్త్ ఫండ్ (AP Wealth Fund): దీర్ఘకాలిక అభివృద్ధి కోసం మరియు సీడ్ కార్పస్‌గా ఉపయోగపడేలా ఈ ప్రత్యేక నిధిని క్రియేట్ చేయడం ఒక వినూత్న ఆలోచన అన్నారు మాధవ్
  • సంక్షేమ పథకాలు: ఎన్టీఆర్ భరోసా, అన్నపూర్ణ క్యాంటీన్లు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలకు యధాతథంగా నిధులు కేటాయించడమే కాకుండా, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.
    ఈ బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా, ఒక ప్రగతిశీల (Forward-looking) ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా ఉందని ప్రజలకు తెలియ చేయాలి
    : ఈ బడ్జెట్ విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా , ప్రధాన మీడియా వేదికగా డబుల్ ఇంజన్ సర్కార్ విజయాలను ప్రచారం చేయాలి .
    ఆడియో కాన్ఫరెన్స్ ను బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ సమన్వయం చేశారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media