TG:పుర పోరులో రేవంత్ మార్క్ ‘క్లీన్ స్వీప్’..

February 17, 2026 12:19 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది అంకం ముగిసింది. సోమవారం (ఫిబ్రవరి 16) జరిగిన పరోక్ష ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 7 నగరపాలక సంస్థలకు గానూ 5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు మేయర్ పీఠాలను అధిరోహించారు.నల్గొండ, రామగుండం, మహబూబ్‌నగర్, మంచీర్యాల కార్పొరేషన్లలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. నిజామాబాద్‌లో కూడా వ్యూహాత్మకంగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలలో 90కి పైగా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ నిలబెట్టుకోగా, బీఆర్ఎస్ మరియు బీజేపీలు ప్రధానంగా కొన్ని మున్సిపాలిటీలకే పరిమితమయ్యాయి. వికేంద్రీకరణ పద్ధతిలో మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడం, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల ప్రభావం ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు చెబుతున్నారు.”ప్రజాపాలనకు పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది” అని సీఎం రేవంత్ రెడ్డి ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media