ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీ సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

2026-27 బడ్జెట్‌లో బీసీ కాంపోనెంట్‌కు ఏకంగా రూ. 51,021 కోట్లు కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం (రూ. 47,456 కోట్లు) కంటే దాదాపు రూ. 3,665 కోట్లు అధికం.చేతివృత్తుల వారికి పనిముట్లు అందించే’ఆదరణ’ పథకానికి రూ. 1,000 కోట్లు కేటాయించి పథకాన్ని పునరుద్ధరించారు. గత ప్రభుత్వం తగ్గించిన 10% రిజర్వేషన్లను పునరుద్ధరించి, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు.26 జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం, హాస్టళ్ల మరమ్మతులు చేపట్టారు.
మద్యం షాపుల్లో బీసీలకు 10% రిజర్వేషన్లు, మత్స్యకారుల కోసం జీవో 217 రద్దు, మరియు యువతకు జనరిక్ షాపుల ఏర్పాటుకు సాయం వంటివి చేపట్టారు.బీసీలపై దాడులను అరికట్టేందుకు ‘బీసీ రక్షణ చట్టం’ ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు.”బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు.. రాష్ట్రానికే ‘బ్యాక్ బోన్’ (వెన్నెముక) అని నమ్మే ప్రభుత్వం మాది” అని మంత్రి సుభాష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
