పామర్రులో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి నిందితుడి అరెస్ట్!

February 17, 2026 11:41 AM

పెదపారుపూడి మండలంలో ఒక అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై సమీప బంధువు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుడివాడ డీఎస్పీ వి. ధీరజ్ వినీల్ పామర్రు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

కుటుంబ కలహాల కారణంగా బాధితురాలి తల్లి ఈనెల 5న పుట్టింటికి వెళ్లింది. ఈనెల 7వ తేదీ సాయంత్రం, పాపకు స్నానం చేయించిన తర్వాత నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాధిత బాలిక తల్లి ఈనెల 14న పెదపారుపూడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పామర్రు సీఐ వి. శుభాకర్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్న పిల్లలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media