డ్రైవర్ కాదు హీరో 50 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్ రమేష్

February 17, 2026 11:50 AM

అన్నమయ్య జిల్లా పుంగనూరులో పెను ప్రమాదం తప్పింది. పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో పుంగనూరు నుంచి మదనపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

బస్సు నడుపుతున్న డ్రైవర్ రమేష్ మార్గమధ్యలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తనకు ఒంట్లో బాగోలేదని గ్రహించిన ఆయన, కళ్ళు తిరుగుతున్నా అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, చాకచక్యంగా బస్సును స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు పక్కకు నిలిపివేశారు. డ్రైవర్ కుప్పకూలిపోవడంతో కండక్టర్ వెంటనే స్పందించి ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్‌కు చికిత్స అందుతోంది.చివరి నిమిషం వరకు ప్రయాణికుల క్షేమం కోరిన డ్రైవర్ రమేష్‌ను స్థానికులు మరియు ప్రయాణికులు రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media