నెల్లూరు జిల్లా రాపూరు MPDO కార్యాలయంలో MPDO భవాని అధ్యక్షతన మండల వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 17న (నేడు) నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవానికి సంబంధించిన గోడ పత్రికలను అధికారులు ఆవిష్కరించారు.
1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు కిశోర బాలబాలికలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందించడం.
Dosage:
1 – 2 ఏళ్ల పిల్లలకు అర మాత్రను (200mg) నీటిలో కలిపి తాపించాలి.
3 – 19 ఏళ్ల వారికి ఒక పూర్తి మాత్రను (400mg) బాగా నమిలి మింగాలి.
మండలంలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, మరియు జూనియర్ కళాశాలల్లో ఈ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తారు.మాఫ్-అప్ డే (Mop-up Day) నేడు మాత్రలు వేసుకోలేకపోయిన విద్యార్థుల కోసం ఫిబ్రవరి 24న ప్రత్యేకంగా మందులు అందజేయడం జరుగుతుంది.మండల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో భవాని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్లు ప్రమీల రాజకుమారి, భాను, హెల్త్ సూపర్వైజర్ కిషోర్ కుమార్ మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
