Cinema: బన్నీపై తప్పుడు ప్రచారం Sorry చెప్పిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్

February 17, 2026 2:15 PM

అల్లు అర్జున్‌ను కలవాలంటే ’42 కఠిన నిబంధనలు’ ఉంటాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలకు తెరపడింది. ‘స్వీకృతి టాక్స్’ (Sweekriti Talks) పాడ్‌కాస్ట్‌లో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తేలడంతో, ఆమె తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు కోరారు.

వివాదం ఏమిటి?

అల్లు అర్జున్‌ను కలిసే ముందు ఆయన టీమ్ తనకు 42 నిబంధనలతో కూడిన నోట్ ఇచ్చారని కావేరి పేర్కొన్నారు. అందులో “సార్ కళ్లలోకి చూడకూడదు, హ్యాండ్‌షేక్ ఇవ్వకూడదు” వంటి వింత నియమాలు ఉన్నాయని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీమ్ తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. ప్రతిష్టకు భంగం కలిగించినందుకు లీగల్ నోటీసులు కూడా పంపింది.

వివాదం ముదరడంతో కావేరి బరువా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “నేను చేసిన వ్యాఖ్యలు వాస్తవాలు కావు. అల్లు అర్జున్ గారు లేదా ఆయన టీమ్ నాకు ఎలాంటి నిబంధనల జాబితా ఇవ్వలేదు. సంభాషణ ప్రవాహంలో పొరపాటుగా అలా అన్నాను. దీనివల్ల కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నాను” అని పేర్కొన్నారు.సదరు వీడియోను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించినట్లు పాడ్‌కాస్టర్ స్వీకృతి వెల్లడించారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media