“నేను క్షేమమే కోలుకుంటున్నాను” అంటూ క్లారిటీ మెగాస్టార్ చిరంజీవి

February 17, 2026 2:51 PM

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల భుజానికి చిన్నపాటి కీ-హోల్ శస్త్రచికిత్స (Shoulder Keyhole Surgery) చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు తెరదించారు.

ఇటీవల అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డ్ అందజేస్తున్న సమయంలో చిరంజీవి చేతికి ఆర్మ్ స్లింగ్ (Arm Sling) ఉండటం చూసి అభిమానులు కంగారు పడ్డారు. “ఆర్మ్ స్లింగ్ చూసి చాలా మంది నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటున్నాను మరియు నా దినచర్యను కూడా మొదలుపెట్టాను” అని చిరు పేర్కొన్నారు. అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్‌కు మరియు తన క్షేమం కోరిన అభిమానులందరికీ మెగాస్టార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media