కడపలో ప్రమాదం ఐసర్ (IISER) విద్యార్థిని రుషికా దుర్మరణం

February 17, 2026 5:25 PM

విహారయాత్రలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తిరుపతి ఏర్పేడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు రెండు బైక్‌లపై గండికోట విహారయాత్రకు బయలుదేరారు.

చెన్నూరు మండల పరిధిలోని ఇర్కాన్ సర్కిల్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన రుషికా (23) కిందపడగా, ఆమెపై నుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న ఠాగూర్ రెడ్డి, మరో విద్యార్థిని అనుగ్రహ డివైడర్‌పై పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media