మదనపల్లి బాలిక హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతి

February 18, 2026 11:06 AM

మదనపల్లి పట్టణం నీరుగట్టుపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కులవర్ధన్ శవమై తేలారు. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కణసానోలపల్లి చెరువులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

నిన్న బాలికపై దారుణానికి ఒడిగట్టినప్పటి నుంచి కులవర్ధన్ పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతదేహం చెరువులో లభ్యమవ్వడం సంచలనంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఇది ఆత్మహత్యా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media