నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న మైనారిటీ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. మైనారిటీ కళాశాల భవనాన్ని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలన్న అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టాయి.
“మైనారిటీ ఆస్తులను కాపాడాలి” అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ నిరసన కారణంగా సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ విద్యా సంస్థల ఉనికిని కాపాడాలని, అధికారుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
