మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాపూరు పంచాయతీ పరిధిలోని మల్లమ్మ గుంట శివాలయంలో ఆది దంపతుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మండల వేద పండితులు నాగరాజ స్వామి ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు.
ఈ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమం అనంతరం నాగరాజ స్వామి శివ పార్వతుల కల్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు. భక్తులందరికీ తీర్థప్రసాదాల వితరణ చేపట్టారు.
