ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించి, పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో 30 అంశాలతో కూడిన అజెండాపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మందికి చేరేలా సోషల్ మీడియా, వీడియో కంటెంట్‌ను వైరల్ చేయాలని సూచించారు. జర్మనీలో జరగబోయే అంతర్జాతీయ పర్యాటక సదస్సులో ఏపీ ప్రాభవాన్ని చాటిచెప్పేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇకపై ఏ ఉత్సవం నిర్వహించినా ముందస్తుగా ‘కర్టెన్ రైజర్స్’ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన గండికోట, విశాఖ ఉత్సవ్, ఫ్లెమింగో ఫెస్టివల్ వంటి కార్యక్రమాల విజయవంతంపై అధికారులను అభినందించారు.ఈ సమావేశంలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
