చక్రతీర్థం వద్ద పటిష్ట బందోబస్తు: డ్రోన్ కెమెరాలతో SP నిఘా

February 19, 2026 10:54 AM

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిరియాబెల్లి రేవు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా SDRF బృందాలు, రోప్ పార్టీలు నిరంతరం పర్యవేక్షించాయి.

ఆలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి డ్రోన్ మరియు సీసీ కెమెరాల ద్వారా ఎస్పీ స్వయంగా భక్తుల రాకపోకలను సమీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media