ఉప్పాడ మత్స్యకారులకు శుభవార్త: Dycmపవన్ కళ్యాణ్

February 19, 2026 12:49 PM

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో మత్స్యకారులు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించినట్లు ఆయన పేర్కొన్నారు.

తీర ప్రాంత కోత నివారణ, కాలుష్య నియంత్రణ మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి మత్స్యకారులకు రక్షణ కల్పించడం.మత్స్య సంపద వృద్ధి కోసం అధునాతన పద్ధతుల్లో వేట, మార్కెటింగ్ సదుపాయాల కల్పన.
ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలతో పాటు తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుదల.మెరైన్ ఫిషరీస్ నిపుణులు, జిల్లా అధికారుల సహకారంతో రూపొందించిన ఈ బృహత్తర ప్రణాళికను తన తదుపరి పిఠాపురం పర్యటనలో అధికారికంగా ప్రకటించనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media