నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని వెనుకబడిన రాపూరు, కలువాయి మండలాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదలు కలిగిన ఈ ప్రాంతాలకు పూర్వవైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోన లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.NTR దూరదృష్టితో నిర్మించిన కండలేరు డ్యాం మట్టికట్ట కోతకు గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే రివెట్‌మెంట్ పనులు చేపట్టాలని సూచించారు. కండలేరు జలాశయం, కలువాయి మినీ రిజర్వాయర్ వద్ద బోటింగ్ సదుపాయం, పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. పెన్నానది వడ్డున ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు విజ్ఞప్తి చేశారు.
