నెల్లూరు జిల్లా రాపూరు స్థానిక గ్రంథాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను హిందూ జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయాధికారి అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భారతదేశ సాంస్కృతిక సంపదను అసాంఘిక శక్తులు ధ్వంసం చేస్తున్న తరుణంలో శివాజీ మహారాజ్ భీకరంగా పోరాడి ధర్మాన్ని కాపాడారని కొనియాడారు. పౌరులందరూ సామరస్య భావంతో మెలగాలని పిలుపునిచ్చారు. భారతదేశ సమర్థతను, సామరస్యతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి శివాజీ అని ప్రశంసించారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, శివాజీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
