అన్నమయ్య జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

February 20, 2026 3:16 PM

అన్నమయ్య జిల్లాలో పెను సంచలనం సృష్టించిన దారిదోపిడీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి (IPS) ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మహారాష్ట్రకు చెందిన నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. రాయచోటి డిఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

మహారాష్ట్రకు చెందిన ట్రక్కు డ్రైవర్ షేక్ ఇర్ఫాన్ విలువైన లోహపు ముద్దలను తరలిస్తుండగా, నిందితులు స్కార్పియోలో వెంబడించి అడ్డగించారు. లోన్ ఈఎంఐ బాకీ ఉన్నామంటూ నమ్మించి, డ్రైవర్‌పై దాడి చేసి ట్రక్కుతో సహా పరారయ్యారు.మహారాష్ట్రకు చెందిన రాజ పుత్ర మల్లారి పిండే, నిసార్ రఫీక్ షేక్, లక్ష్మణ్ దిగంబర్ షేక్, మరియు సూరజ్ రమేష్ చౌదరిలను చిట్లూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.రూ. 1.50 కోట్ల విలువైన 33 లోహపు ముద్దలు (SN Alloy) కలిగిన అశోక్ లేలాండ్ ట్రక్కు.నేరానికి వాడిన స్కార్పియో వాహనం, దాడికి ఉపయోగించిన కొరడా, మరియు 5 సెల్‌ఫోన్లు. క్లిష్టమైన ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సీఐ కృష్ణంరాజు నాయక్, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, రామాపురం ఎస్ఐ శివకుమార్ బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media