ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో సీఎం సమక్షంలో ఏపీ ప్రభుత్వం ప్రముఖ సంస్థలతో 7 కీలక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.
అమరావతిని ‘క్వాంటం వ్యాలీ’గా మార్చే లక్ష్యంతో ఐబీఎం (IBM), యూఎన్ఐసీసీ (UNICC) వంటి సంస్థలతో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు.IBM సహకారంతో రాష్ట్రంలోని లక్ష మంది యువతకు క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో ‘ఏఐ ట్యూటర్’ (AI Tutor) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.NIELIT సహకారంతో దక్షిణ భారతదేశంలోనే మొదటి ఏఐ-క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ‘భారత్ జెన్’ ప్రాజెక్ట్ ద్వారా 22 భారతీయ భాషలను ఏఐ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించనున్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్ది, ఏపీని ఏఐ-క్వాంటం రంగాల్లో ఛాంపియన్‌గా నిలుపుతామని స్పష్టం చేశారు.
