నెల్లూరు జిల్లా నుంచి కడప, అన్నమయ్య జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ‘రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డు’ నరకం చూపిస్తోంది. దాదాపు 19 కిలోమీటర్ల పొడవున్న ఈ ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది.
ప్రమాదకరమైన మలుపుల వద్ద కనీసం సూచిక బోర్డులు లేవు. రోడ్లు కుంగిపోవడం, రక్షణ గోడలు (పిట్టగోడలు) కూలిపోవడంతో లోయలోకి వాహనాలు పడిపోయే ప్రమాదం ఉంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
