“ఖరీదైన బైక్‌లు కొనిస్తున్నారు.. కానీ క్రమశిక్షణ నేర్పడం లేదు:police

February 21, 2026 12:27 PM

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాజోలు సీఐ టి.వి. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ములికిపల్లి, కడలి గ్రామాల మీదుగా చింతలపల్లి వరకు సాగిన ఈ ర్యాలీలో పోలీసులు స్వయంగా హెల్మెట్లు ధరించి పాల్గొని సందేశాన్ని ఇచ్చారు.

ములికిపల్లి – కడలి గ్రామాల మధ్య తరచుగా జరుగుతున్న ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోతుండటంపై సీఐ ఆవేదన వ్యక్తం చేశారు.విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ లేకపోవడం, గారాబంతో మైనర్లకు ఖరీదైన బైక్‌లు, సెల్ ఫోన్లు కొనివ్వడం ప్రమాదాలకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు.లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, యువతలో మార్పు రావాలని సీఐ పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media