AP:శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న జర్మన్ దేశస్థులు

February 21, 2026 12:56 PM

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని శుక్రవారం జర్మనీ మరియు రష్యా దేశస్థులు సందర్శించుకున్నారు. భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతిపై ఉన్న మక్కువతో ఈ విదేశీ ప్రతినిధులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం.

ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్న పర్యాటకులు.. దక్షిణ కాశీగా పిలవబడే శ్రీకాళహస్తికి విచ్చేశారు. వీరు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలోని అద్భుత శిల్ప సంపదను, చారిత్రక ప్రాధాన్యతను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. ఆలయ వైదిక కమిటీ వీరికి క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించింది. దర్శనం అనంతరం వేద పండితులు విదేశీ పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందజేసి, వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం పలికారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media