కర్ణాటక పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరుడుగట్టిన నేరస్తుడు నసీర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక హత్యలు, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిపై కర్ణాటకలో ‘డకాయిటీ షీట్’ కూడా ఉంది.

పదేళ్ల క్రితం రాయచోటికి చేరుకున్న నసీర్, ఇక్కడి మహిళను వివాహం చేసుకుని స్థానికుడిలా నటిస్తూ పోలీసులను బురిడీ కొట్టించాడు. కొంతకాలం దుబాయ్‌లో తలదాచుకున్న నసీర్, నెల రోజుల క్రితమే రాయచోటికి తిరిగి వచ్చాడు. అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.గత 20 రోజులుగా స్థానిక పోలీసుల సాయంతో నిఘా ఉంచిన కర్ణాటక పోలీసులు.. శనివారం (ఫిబ్రవరి 21, 2026) పక్కా ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నసీర్ సహచరులైన మరో ఇద్దరు క్రిమినల్స్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
