వల్లూరు సొసైటీ బ్యాంక్ ఆవరణలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి రైతులకు యూరియా బస్తాలను అందజేశారు.

సాగులో యూరియాను మోతాదుకు మించి వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ రూపొందించిన అవగాహన కరపత్రాన్ని పుత్తా నరసింహారెడ్డి ఆవిష్కరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, క్యూ లైన్లలో ఇబ్బంది పడకుండా సజావుగా యూరియా అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులు కూడా తమ అవసరానికి తగినంత మాత్రమే తీసుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీఏ (ADA) నరసింహారెడ్డి, ఏవో (AO), సచివాలయ సిబ్బంది మరియు సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
