రాపూరులో ‘స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా’.. mission

February 21, 2026 5:44 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా” కార్యక్రమంలో భాగంగా రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మూడవ శనివారం కావడంతో ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుధ్యం మరియు పరిశుభ్రతపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

మండల పరిషత్ అధికారి (ఎంపీడీఓ) దశరధరామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. గ్రామాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ‘స్వర్ణ ఆంధ్రా’ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాపూరు మండల పరిషత్ సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media