TG:కామారెడ్డిలో టెన్షన్ షబ్బీర్ అలీ vs MLA వెంకటరమణారెడ్డి

February 23, 2026 11:26 AM

జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య మొదలైన సవాల్ ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కింది.

కాలేజీ భూములను అమ్ముకున్నారని షబ్బీర్ అలీ ఆరోపించగా, ఎమ్మెల్యే రమణారెడ్డి ఆ సవాల్‌ను స్వీకరించారు. భూములకు సంబంధించిన అన్ని పత్రాలతో కలెక్టర్ కార్యాలయానికి వస్తానని రమణారెడ్డి ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గత మూడు రోజులుగా ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. SP రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా తాను కలెక్టరేట్‌కు వెళ్తానని ఎమ్మెల్యే పట్టుబట్టడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media