నెల్లూరు జిల్లా రెవెన్యూ శాఖలో ఒకేరోజు రికార్డు స్థాయిలో పదోన్నతులు లభించాయి. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో 26 మంది రెవెన్యూ సిబ్బందికి పదోన్నతి పత్రాలను (Proceedings) అందజేశారు.
- సీనియర్ అసిస్టెంట్ ➡ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (MRI): 08 మంది.
- గ్రేడ్–I విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ➡ సీనియర్ అసిస్టెంట్: 18 మంది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని, ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా భూ సంబంధిత అంశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా, నిజాయితీతో సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయకుమార్, ఏఓ మరియు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
