AP:పులివెందుల ACB వలలో రూరల్ CI, SI

February 23, 2026 5:10 PM

కడప జిల్లా పోలీస్ శాఖలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి, రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్సై అనిల్ కుమార్ లను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అసలేం జరిగింది?
కాశ్మీర్‌లో చోరీ అయిన ఒక ద్విచక్ర వాహనాన్ని నంబర్ ప్లేట్ మార్చి ఏపీలో విక్రయించారు. ఆ వాహనంపై చైన్ స్నాచింగ్‌లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో వాహనాన్ని విక్రయించిన కదిరికి చెందిన ఏజెంట్ బ్రహ్మంను పోలీసులు బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గత శనివారం బ్రహ్మం లక్ష రూపాయలు చెల్లించినప్పటికీ, మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి తేవడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం బాధితుడి నుంచి రూ. 1.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పోలీసులను పట్టుకున్నారు.DSP మరియు రూరల్ CI ఆదేశాలతోనే తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు SI అనిల్ కుమార్ ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఏసీబీ అధికారులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని గత మూడు గంటలుగా విచారిస్తున్నారు. లంచం సొమ్మును సీజ్ చేసిన అధికారులు, ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media