క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు తిరుపతి కలెక్టర్ Dr.S. వెంకటేశ్వర్

February 23, 2026 5:55 PM

నైపుణ్యం గల విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు సభ ఆదివారం ఘనంగా జరిగింది.

పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ మరియు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ మెడల్స్, సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాస్కెట్‌బాల్, బాడ్మింటన్, రైఫిల్ షూటింగ్ కోసం గతంలో కంటే మెరుగైన వసతులు కల్పించామని కలెక్టర్ తెలిపారు. పి.వి.సింధు, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఒలింపిక్స్‌లో భారత్ మరిన్ని పతకాలు సాధించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.కేవలం చదువుకే పరిమితం చేయకుండా, పిల్లల మానసిక ఉల్లాసం మరియు శారీరక దృఢత్వం కోసం తల్లిదండ్రులు వారిని క్రీడల వైపు ప్రోత్సహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎన్. శశిధర్ మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media