మహిళలు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్‌ను ఒక ఆయుధంగా మలచుకోవాలని అవంతి కళాశాల డైరెక్టర్ ఎ. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తగరపువలస అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూ-జీవీ (JNTUGV) పరిధిలోని ఆరు జిల్లాల స్థాయి కరాటే, టైక్వాండో సెలక్షన్ ట్రైల్స్ ఘనంగా నిర్వహించారు.
ఈ సెలక్షన్ ట్రైల్స్‌లో తొమ్మిది కళాశాలల నుంచి కరాటే విభాగంలో 27 మంది, టైక్వాండో విభాగంలో 11 మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ట్రైల్స్‌లో ఎంపికైన టైక్వాండో క్రీడాకారిణులు మార్చి 16 నుండి 20 వరకు ఒరిస్సాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారు. కరాటే విభాగంలో ఎంపికైన బాలురు, బాలికలు మార్చి 17 నుండి 21 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ (సాగి యూనివర్సిటీ)లో జరిగే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ విశ్వ ప్రసాద్, ప్రిన్సిపాల్స్ రామకృష్ణ, నాగ పూర్ణశ్రీ, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ రాము మరియు క్రీడా సిబ్బంది పాల్గొన్నారు
