నర్సీపట్నం రూరల్ పోలీసులు భారీ ఎత్తున గంజాయి రవాణాను అడ్డుకున్నారు. రూరల్ సీఐ రేవతమ్మ నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో 168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
హరిబాబు అనే పాత నేరస్థుడు రెండు బొలెరో వాహనాలలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక అరలను అమర్చి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి మరియు వాహనాల విలువ సుమారు రూ. 1.19 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. SIలు తారకేశ్వరరావు, రిషికేశ్వరరావు మరియు వారి బృందం పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ హెచ్చరించారు.
