యువతను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా రాపూరు పట్టణంలో “వజ్ర ప్రహర్” కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్ఐ వెంకట రాజేష్ నేతృత్వంలో ఈ అవగాహన సదస్సు జరిగింది.
మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ జీవితాలను చిధ్రం చేసుకోవద్దని ఎస్ఐ హితవు పలికారు.డ్రగ్స్ విక్రయించినా, వాడినా చట్టరీత్యా కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.సమాజంలో ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.రాపూరును డ్రగ్స్ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు.
