రాజమండ్రి కల్తీ పాల విషాదం మృత్యుపాశంలా మారిన ‘ఇథిలీన్ గ్లైకాల్’

February 24, 2026 2:21 PM

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు వృద్ధులు మృతి చెందగా, మరో 14 మంది ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ మరణాలకు పాలలో కలిసిన ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనమే కారణమని నిర్ధారణ అయ్యింది. సాధారణంగా పరిశ్రమల్లో కూలెంట్‌గా వాడే ఈ రసాయనం, పాలను నిల్వ చేసే యంత్రాల నుంచి లీక్ అయిందా లేక కావాలనే కలిపారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇథిలీన్ గ్లైకాల్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత కేవలం 8 గంటల్లోనే అవయవాలను నిర్జీవం చేస్తుంది ఇది నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. మనిషి స్పృహ కోల్పోవడం, నరాలు స్తంభించిపోవడం జరుగుతుంది. నరాల్లో రక్త ప్రసరణ ఆగిపోయి, ఊపిరితిత్తులు మరియు గుండెకు ఆక్సిజన్ అందదు. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతింటాయి. దీనివల్ల అనూరియా (Anuria – మూత్రం రాకపోవడం) సంభవించి ప్రాణాలు పోతాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media