AP:కోరుకొండలో అంగన్‌వాడీల రెండో రోజు దీక్ష!

February 24, 2026 2:36 PM

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోరుకొండ ఐసీడీఎస్ (ICDS) కార్యాలయం ముందు రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. మాలతి, అన్నపూర్ణల నేతృత్వంలో జరిగిన ఈ దీక్షా శిబిరాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వి.ఎన్. పూర్ణిమ రాజు సందర్శించి మద్దతు ప్రకటించారు.

అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి మరియు వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి. మే నెల అంతా వేసవి సెలవులు ఇస్తూ తక్షణమే జీవో విడుదల చేయాలి.తల్లికి వందనం పథకాన్ని అంగన్‌వాడీ పిల్లలకు కూడా వర్తింపజేయాలి. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్ వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే భారీ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అధిక సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media