తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి RK రోజా

February 25, 2026 12:34 PM

సినీ నటి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆమె స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయ అధికారులు రోజాకు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టు వస్త్రాన్ని అందజేశారు.ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media