AP:రోడ్డెక్కనున్న అగ్రిగోల్డ్ బాధితులు మార్చి 2 నుంచి దీక్ష

February 25, 2026 3:57 PM

అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి పోరాట బాట పట్టారు. మార్చి 2వ తేదీ నుంచి విజయవాడ వేదికగా దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రకటించారు.మార్చి 2 – 4 విజయవాడలో రిలే నిరాహార దీక్షలు.మార్చి 5 నుండి డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక నిరాహార దీక్షలు.

అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి.40 మంది పోలీస్ అధికారులతో కూడిన ప్రత్యేక సిట్ (SIT) ద్వారా ఆస్తులను మదింపు చేయాలి.బినామీల పేర్లపై ఉన్న రూ. 4 వేల కోట్ల ఆస్తులను వేలం వేసి బాధితులకు పంచాలి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపై ప్రత్యేకంగా సమయం కేటాయించి చర్చించాలి.అగ్రిగోల్డ్ సంస్థ మూతపడి 12 ఏళ్లు గడుస్తున్నా, 32 లక్షల మంది బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇ.వి. నాయుడు మాట్లాడుతూ, యాజమాన్యం ప్రజల సొమ్మును హవాలా ద్వారా విదేశాలకు తరలించిందని ఆరోపించారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ కష్టార్జితం తిరిగి వచ్చే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media