ప్రకాశం జిల్లా రైతాంగం ఆశాదీపం అయిన వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్కాపురం పర్యటనలో భాగంగా ప్రాజెక్టు డిజైన్లు, టన్నెల్ పనులు మరియు నీటి విడుదల ప్రణాళికలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, హెడ్ రెగ్యులేటర్ డిజైన్లను నీటిపారుదల శాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులతో కలిసి సీఎం సమీక్షించారు.పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ప్రాజెక్టు అంచనాలు, నిధుల విడుదలపై చర్చలు జరిపారు. జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీరందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
