నెల్లూరులో నూతన వధూవరులను ఆశీర్వదించిన YS జగన్ video

February 26, 2026 3:19 PM

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కనుపర్తిపాడు హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

హెలిప్యాడ్ వద్ద జగన్‌కు జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.కనుపర్తిపాడు నుంచి నేరుగా విపిఆర్ (VPR) కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్న జగన్, అక్కడ జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారితో కాసేపు ముచ్చటించారు.జగన్ రాకతో నెల్లూరు నగరం వైసీపీ జెండాలతో కళకళలాడింది. హెలిప్యాడ్ వద్దకు, కన్వెన్షన్ హాల్ వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.వివాహ వేడుక అనంతరం జగన్ తిరిగి కనుపర్తిపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తాడేపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media