AP:రావివలసలో CM పర్యటనకు ఏర్పాట్లు ‘HPV వ్యాక్సిన్’ లాంచ్

February 26, 2026 6:00 PM

ఈ నెల 28న చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో నిర్వహించనున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, భద్రత మరియు వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు.

రావివలసలో లబ్ధిదారులతో ముఖ్యమంత్రి నేరుగా ముచ్చటించి, పింఛన్లను పంపిణీ చేస్తారు. అనంతరం పార్టీ క్యాడర్‌తో సమావేశం కానున్నారు. అదే రోజు 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ పంపిణీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రావివలస నుంచే వర్చువల్ ద్వారా పాల్గొంటారు. పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్‌తో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు మరియు శానిటేషన్ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media