భీమిలి సెయింట్ ఆన్స్ స్కూల్ వార్షికోత్సవం..

February 28, 2026 12:55 PM

స్థానిక సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సెయింట్ ఆన్స్ సొసైటీ ప్రోవిన్సియల్ సూపర్వైజర్ సిస్టర్ సాండ్రీన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన జరుగుతుందో, అక్కడ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సిస్టర్ సాండ్రీన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక జ్ఞాపికలను అందజేసి అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు సందర్శకులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రోవిన్సియల్ కౌన్సిలర్ సిస్టర్ ప్రేమ, ప్రిన్సిపాల్ క్రిస్టీ జాన్, కరస్పాండెంట్ సిస్టర్ త్రిసా మేరీ, ఫాదర్ ఆల్ఫోన్స్ మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media